రాజధానిలో మహిళలపై జరిగిన దాడి గురించి టీడీపీ నేతలు జాతీయ మహిళా కమిషన్ సభ్యులను కలిశారు. గుంటూరులో ఈ రోజు జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటిస్తోంది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహిళా కమిషన్ సభ్యులను టీడీపీ నేతలు గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ కలిశారు.
ఈ నేపథ్యంలో అమరావతిలో మహిళలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు. రాజధానిలో మహిళలపై జరిగిన దాడి గురించి కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చిన టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో పలువురు మహిళలపై దాడి జరిగిన విషయం తెలిసిందే.