telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

‘100’కు కాల్ చేస్తే.. పోయిన లగేజ్ తెప్పించారు

100 dail police

సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఓ వ్యక్తి విజయవాడకు వెళ్ళేందుకు ఎల్బీ నగర్ వరకూ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ దిగిన తరువాత చూసుకోగా, ఓ బ్యాగ్ కనిపించలేదు. దాన్ని దించుకునే లోపే డ్రైవర్ తన వాహనంతో వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆరిఫ్, వెంటనే ‘100’కు కాల్ చేసి విషయం చెప్పాడు.

నిమిషాల్లో స్పందించి, అక్కడికి చేరుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను చూసి, క్యాబ్ నంబర్ ను గుర్తించారు. ఆ వెంటనే అతని ఫోన్ నంబర్ ను సేకరించి రప్పించారు. సాంకేతికత సాయంతో నిమిషాల్లోనే లగేజీని తిరిగి తెప్పించారు. పోలీసింగ్ యాప్ కారణంగానే డ్రైవర్ ఫోన్ నంబర్ వెంటనే తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

Related posts