telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్న క్యాంటీన్ల మూసివేతపై చంద్రబాబు ఆగ్రహం

chandrababu

పేదల ఆకలి తీర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఏపీలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. కేవలం రూ. 5 కే ఈ క్యాంటీన్లలో భోజన వసతి కల్పించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసివేసింది. దీంతో దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఇటువంటి శిక్ష విధించారని ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “నామమాత్రంగా ఐదు రూపాయలకే పోషకాలతో కూడిన భోజనాన్ని చేసే అవకాశాన్ని లక్షలాది మంది కోల్పోయారు. దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగులు వారి జీవనాధారాన్ని కోల్పోయారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఈ విధంగా శిక్షిస్తున్నారు?” అని అడిగారు.

Related posts