telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 3, శుక్రవారం రాశిఫలాలు..

మేషరాశి..

అనుకున్న పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. కొత్త రుణాల కోసం ప్ర‌యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

వృషభరాశి..

దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రముఖుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఆహ్వానాలు అందుతాయి.అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.అదృష్ట యోగం ఉంది.

మిథునరాశి..

బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. మానసిక ప్రశాంతత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకరాశి..

వాహనం వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వస్తుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు. దైవ‌ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారతాయి.

సింహరాశి..

రాబడి అంతగా కనిపించదు. స్త్రీలకు టి.వి., కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు చేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య‌రాశి..

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యత, మానసికాందోళన వల్ల అనారోగ్యానికి గురయ్యే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తీరతాయి.

తులరాశి..

మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం శ్రేయస్కరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికరాశి..

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు.

ధనుస్సురాశి..

ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కుంటారు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు వాయిదా. శ్రమ ఫలిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్ప‌డ‌తాయి.

మకరరాశి..

నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందుతారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో ఆదరణ ల‌భిస్తుంది. వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర‌వుతాయి.

కుంభరాశి..

ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనరాశి..

రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

Related posts