telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోసాని ఎవరు వదిలిన బాణం ?

జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ వై .సి. .పి మీద తీవ్రమైన ఆరోపణలతో ధ్వజం ఎత్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్లైన్ లో పెడుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ “రిపబ్లిక్ ” సినిమా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ఇతర మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు . పవన్ ఆరోపణలతో తెలుగు సినిమా రంగం ఉలిక్కిపడి . అతని ఆరోపణలు వ్యక్తిగతమైనవని , వాటితో సినిమా రంగానికి సంబంధం లేదని ప్రకటించింది.

Posani Krishna Murali fires on Pawan Kalyan

వై .సి .పి మంత్రులు కూడా తిరిగి పవన్ కళ్యాణ్ ఆరోపణలు ప్రతిస్పందించారు .ఈ నేపధ్యలో సోమవారం రోజు నటుడు, రచయిత , దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ పై సంచలన విషయాలను బయటపెట్టారు. తెలుగు హీరోలు అక్కినేని నాగేశ్వర రావు , నందమూరి తారక రామారావు , కన్నడ రాజ్ కుమార్ లు అసలు సిసలు హీరోలు . సినిమా పరిశ్రమ మేలు , పంపిణీదారులు , ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని నడుచుకున్నారు. కానీ నువ్వు సినిమా సినిమాకు పారితోషికం పెంచుకుంటూ ఇప్పుడు 50 కోట్లు తీసుకుంటున్నావు . కాదని నువ్వు రుజువు చెయ్యి అని పోసాని తీవ్రంగా ప్రతిస్పందించారు .

పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి | Posani Krishna Murali Fires On Pawan Kalyan. పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి

పోసాని ఇంతలా స్పందించి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చెయ్యడానికి కారణం ఎవరి ప్రోద్బలం ?
మంత్రులు మాట్లాడినా జనంలోకి అంతగా వెళ్లాడని, ముల్లును ముల్లుతోనే తియ్యాలని ఉద్దేశ్యం తోనే పోసానిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగించిందని చెప్పుకుంటున్నారు . ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకొమ్మని సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి గారితో చెబుతానని పోసాని తెలిపారు . పోసాని అనారోగ్యతో ఆసుపత్రిలో ఉండగా సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి పరామర్శించారు .

Sajjala Ramakrishna Reddy Telugu Political Leader Profile & Biography-TeluguStop

సజ్జల రామకృష్ణా రెడ్డితో టచ్ లో వుండే పోసాని కృష్ణ మురళి వెనుక ఎవరు వున్నారో దీనినిబట్టి అర్ధమవుతుంది . పవన్ కళ్యాణ్ కు ధీటైన సమాధానం పోసాని మాత్రమే చెప్పగలడని వారు భావించారు కాబట్టే వారు దిశా నిర్ధేశనం చేసినట్టు తెలుస్తుంది పోసాని అనే అస్త్రాన్ని పవన్ మీదకు వదిలారు . వారు అనుకున్నట్టు గానే ఈ బాణం పవన్ ఇమేజ్ ను బాగానే డామేజ్ చేసిందని సినిమా రంగంలో చెప్పుకుంటున్నారు . .

Related posts