telugu navyamedia
తెలంగాణ వార్తలు

బస్తీ దవాఖానలు… దోస్తీ దవాఖానలు..

అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా కొత్తకొత్త మార్గాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులను చూశాం, కొత్త వేరియంట్ వస్తోందనే భయాందోళన పెంచుకోవద్దని సూచించారు. సికింద్రాబాద్ సమీపంలోని బోయిన్ పల్లిలో బస్తీదవాఖానా ప్రారంభించారు.

హైదరాబాద్ లో బస్తీదవాఖానాలు… పేదప్రజలపాలిట దోస్తీ దవాఖానాలుగా మారిపోయాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తూ… నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్నారని అభినందించారు. కోవిడ్ టీకాలు వేసుకోనివారు… తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని కోరారు.

అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానల్లో 54 రకాల వ్యాధులను నిర్థారించే పరీక్షలను నిర్వహిస్తారని, సుస్తయినపుడు… ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి డబ్బులు ఖర్చుచేసుకోవద్దని సూచించారు. కొత్త వేరియంట్ ఓ మైక్రాన్ వచ్చేస్తోంది… వస్తోంది… అని భయాలు పెట్టుకోవద్దని సూచించారు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకుని ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Related posts