telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రథసప్తమి వేడుకల పై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ…

special buses for lord venkateswara swamy utsav

ఫిబ్రవరి 19వ తేదీన రథసప్తమి వేడుకలు తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… ఒక్కే రోజు సప్తవాహనాలలో శ్రీవారు భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు.. అయితే, కరోనా నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ.. మాడ వీధుల్లో వాహన సేవలు… దర్శన టోకేన్లు కలిగిన భక్తులుకు మాత్రమే గ్యాలరిలోకి అనుమతించనున్నారు.. ఇక, చక్రస్నానం కార్యక్రమాన్ని ఏకాంతంగానే నిర్వహించనుంది టీటీడీ.. ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగనుండగా.. ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ ఉంటుంది. ఇక, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ , సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉరేగింపు.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts