టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులుగా అభిమానుల ప్రశ్నలకు ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఓ టైటిల్ ను చెప్పాలని అభిమానులు కోరిన సంగతి తెలిసిందే. దీనికి కేటీఆర్, తనదైన శైలిలో టైటిల్ ను పెట్టారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’కు మీరైతే ఏం టైటిల్ పెడతారని అడుగగా, తానైతే ‘రీజనల్ రింగ్ రోడ్’ అని పెడుతా అంది తనదైన శైలిలో స్పందించారు. ఇక కేటీఆర్ సూచించిన టైటిల్ ను దర్శకుడు రాజమౌళి అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి మరి.
previous post
next post
తిత్లీ తుపాను హామీ మర్చిపోయారా జగన్ గారూ: లోకేశ్