telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు షాక్…!

బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ రాజకీయ నాయకుడి పాత్రలో అమెజాన్ ప్రైమ్ రూపొందించిన వెబ్ సిరీస్ తాండవ్. ప్రంపంచంలోని ప్రముఖ ఓటీటీ సంస్థల్లో అమెజాన్ కూడా ఒకటి. ప్రఖ్యాత ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. ఈ సంస్థలు చేసే వెబ్ సిరీస్‌లు భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని, వారు ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నారని విమర్శలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. ఇదేవిధంగా ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి సైఫ్ అలీ ఖాన్ నటించిన తాండవ్ కూడా చేరింది. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా కొన్న సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్‌లో ఉన్నాయిని వాటిని కావాలనే చిత్రిస్తున్నారని, వాటి ద్వారా వివాదాలు రేకెత్తితే తమ వెబ్ సిరీస్‌కు ఉచిత పబ్లిసిటీ వస్తుందన్న ఆలోచనతోనే ఈ సంస్థలు ఇలా చేస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. వీరు హిందూ దేవుళ్లను తప్ప మరే ఇతర మతాల జోలికి వెళ్లరని, హిందువులంటే చులకన అయ్యారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండవ్ వెబ్ సిరీస్‌లో ఇటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఉత్తరాదిలోని కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts