telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపావళి కానుకగా ‘భద్రకాళి’ చిత్రం ట్రైలర్ విడుదల

Bhadrakali

లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం ‘భద్రకాళి’ అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియెట్ చేసింది. మళ్ళీ అదే టైటిల్ తో బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న చిత్రం ‘భద్రకాళి’. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు వీగా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యి సంగీత ప్రియులను అలరింపచేస్తున్నాయి. దీపావళి కి ట్రైలర్ విడుదల చేస్తున్నామని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలియచేసారు. సీనియర్‌ నటి సీత, సంధ్య, మనీష్‌, తాగుబోతు రమేష్‌, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.  సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్‌ టి, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: RGB స్టూడియోస్‌, డి.ఐ: ప్రభు,ఎడిటింగ్‌: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు, ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌.

Related posts