telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “ది వైట్ టైగర్” ట్రైలర్

The-White-Tiger

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం “ది వైట్ టైగర్”. ఈ సినిమా ఫేమస్ నవల ’ది వైట్ టైగర్’ ఆధారంగా రమిన్ బహ్రానీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆద‌ర్శ్ గౌర‌వ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జ‌న‌వ‌రి 22న నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కొన్ని థియేట‌ర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బుధ‌వారం రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

“ది వైట్ టైగర్” నవలను ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రాశారు. ఈ నవల 2008లో న్యూయార్క్ బెస్ట్ సెల్లర్‌గా అవార్డు అందుకుంది. విదేశాల నుంచి వ్యాపారం చేయాలని వచ్చే పాత్రలుగా ప్రియింకా, రాజ్ కుమార్ కనిసించనున్నారు. అందులో మరో ప్రధాన పాత్రైన పేద డ్రైవర్‌గా ఆదర్శ్ గైరవ్ కనబడనున్నాడు. వారిని తన తెలివితేటలతో నమ్మించి మోసం చేసి తాను ఎలా ధనవంతుడయ్యాడన్న దానిపై సినిమా నడవనుంది.

Related posts