telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

డిస్నీకి 700 కోట్ల లాభం… ఆ ఒక్క నటుడిని తొలగించినందుకే…!!

Johnny-Depp

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ మూవీ సిరీస్ లలో “పైరేట్స్ అఫ్ ది కరేబియన్” కూడా ఒకటి. ఈ చిత్రాల్లో జాక్ స్పారో అనే కీలకపాత్రలో జానీ డెప్ హీరోగా నటించాడు. ఈ సిరీస్ జానీ డెప్ కు ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును సంపాదించి పెట్టింది. అయితే ఇటీవలే కొన్ని కారణాల వల్ల జానీ డెప్ ను ఈ చిత్రం నుంచి తొలగించినట్టు ప్రకటించారు నిర్మాతలు. “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” సిరీస్ తాజా చిత్రం నుంచి జానీ డెప్ ను తొలగించడం వల్ల డిస్నీ సంస్థకు రూ. 700 కోట్లు (సుమారు 90 మిలియన్ డాలర్లు) మిగులుతున్నాయని “ఫోర్బ్స్” ప్రకటించింది. జానీ డెప్ మాజీ భార్య అంబర్ హర్డ్, అతనిపై వేధింపుల ఆరోపణలు చేయడం, ఇటీవల ఆయన నటించిన “మోర్ట్ డెకాయ్”, “ది లోనే రేంజర్” లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంలో విఫలం కావడం వంటి కారణాల వల్లే డిస్నీ యాజమాన్యం “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” సిరీస్ తాజా చిత్రం నుంచి జానీ డెప్ ను తొలగించిందని తెలుస్తోంది.

Related posts