telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పుజారా ఔట్… పంత్ హాఫ్ సెంచరీ

గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య ప్రస్తుతం చివరి టెస్ట్ లో ఆఖరి రోజు ఆట జరుగుతుంది. అయితే భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం ఉన్న సమయంలో అర్ధశతకం చేసిన పుజారా(56) ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 228 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. దాంతో 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పంత్ తో కలిసి ఆడేందుకు మయాంక్ అగర్వాల్ వచ్చాడు. అయితే ఈరోజు ఆట ముగియడానికి  ఇంకా 19 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూడాలి మరి ఈలోపు టీం ఇండియా తన లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేదా అనేది.ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత యువ వికెట్ కీపర్ 100 అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే పంత్ తన వ్యక్తిగత స్కోర్ 9 వద్ద ఉన్నప్పుడే టెస్ట్ క్రికెట్ లో 1000 పరుగులు పూర్తి చేసాడు. అయితే ఈ మార్క్ ను కేవలం 27 ఇన్నింగ్స్ లో అందుకున్నాడు. అయితే ఇదే సమయంలో టెస్ట్ మ్యాచ్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు పూర్తి చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రస్తుతం 254/4 తో నిలిచింది టీం ఇండియా. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 14 ఓవర్లలో 74 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంత్(50), మయాంక్(8) తో బ్యాటింగ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts