telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

న్యూఇయర్ : నాలుగు రోజుల్లో 758 కోట్ల లిక్కర్ సేల్స్…

liquor shops ap

మన రాష్ట్రంలో మామూలుగానే మధ్య అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే న్యూఇయర్ వస్తుందంటే .. చిన్నాపెద్ద తేడాలేకుండా మందు పార్టీలు నడుస్తున్నాయి… కరోనా సమయంలోనూ లిక్కర్ సేల్స్ ఎక్కడా తగ్గలేదు.. గ్రాండ్ ఈవెంట్స్, పార్టీలు, పెద్దగా హవావుడి లేకపోయినా.. సైలెంట్‌గా మద్యం లాగించారు. గత ఏడాదితో పోలిస్తే అనూహ్యంగా అమ్మకాలు పెరిగాయి.. ఏకంగా రూ.287 కోట్ల అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి… ఈ ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి 31వ వరకు రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది… గతేడాది డిసెంబర్ 28 నుండి 31 వరకు రూ. 472 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే సాగాయి.. అయితే, గతేడాది బీర్ల అమ్మకాలతో పోలిస్తే మాత్రం ఈ సారి బీర్ల అమ్మకాల్లో పెద్దగా తేడా లేదు.. కానీ, గతేడాది చివరి నాలుగు రోజులల్లో లిక్కర్ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది చివరి నాలుగు రోజుల్లో 2.60 లక్షల కేసుల మద్యం ఎక్కువగా లాగించేశారు.. మొత్తంగా.. పెద్ద హడావుడి లేకున్నా.. గత ఏడాది కంటే.. రూ.287 కోట్ల మద్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు.. మొత్తంగా.. ఏడాది చివరి నాలుగు రోజుల్లో రూ.758.76 కోట్ల మద్యం తాగేశారు. మద్యం అమ్మకాలపై ఎక్కడా కోవిడ్ ప్రభావం కనబడలేదు..

Related posts