telugu navyamedia
సినిమా వార్తలు

అసోం వరద బాధితులకు బిగ్ బి భారీ విరాళం

Amitab Bachchan Tweet on RGV

అసోంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల తాకిడికి ప్రజల జీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ కుండపోత వర్షాలతో, ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలాంటి పరిస్థితులలో ఉన్న అసోంను చూసి చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, మీరు కూడా సాయం చేయండి అంటూ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తాజాగా వరదలతో ముంచెత్తుతున్న అసోంకు అండగా నిలిచేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ముందుకొచ్చారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు బిగ్ బీ తన వంతుగా రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. కుండపోత వర్షాలు, వరదలతో అసోంలో నిరాశ్రయులైన లక్షలాది మంది కోసం నా వంతుగా సహాయం చేశా. సోదరసోదరీమణులారా మీ వంతుగా సీఎం సహాయ నిధికి తోచిన విరాళం అందించాలని బిగ్ బీ విజ్ఞప్తి చేశారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ అసోం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Related posts