telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరిలాంటి ఆడదాన్ని కాదు… పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం : రేణూదేశాయ్

Renu

హీరోయిన్ రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసింది. స్త్రీవాదం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ”ఈ సమాజంలో ఎంతోమంది దృష్టిలో నేను ఒంటరి మహిళను, సింగిల్ పేరెంట్‌ని. అందరిలాంటి ఆడదాన్ని కాదు. పురుషుల ప్రపంచంలో తాను అనుకున్నట్లుగా, తన నిబంధనలపై జీవించే స్త్రీని. భర్త మద్దతు లేకుండా తన పిల్లలను సంపూర్ణంగా పెంచుకునే తల్లిని. తన కాళ్లపై తాను నిలబడి, వ్యాపారం చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే సామర్థ్యం ఉన్న మహిళని. అలాగే అన్యాయాలను గట్టిగా ఎదిరించే ఆడదాన్ని. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని ఓ స్త్రీని. కానీ ఇవ్వన్నీ ఎలాంటి కారణాలు లేకుండా నాపై ఉన్న అనుపయుక్త అభిప్రాయలు. అయితే స్వతంత్ర్య ఆలోచనలతో బ్రతకాలని, నన్ను అనుసరించే యంగ్ గర్ల్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీకంటూ ఓ ప్రత్యేక దృక్పథం కలిగి ఉండటం మంచిదే. వేరొకరి కుమార్తెగా లేదా భార్యగా ఉండటం మీ అసలైన గుర్తింపు కాదు. మీ లైఫ్‌లో మీరే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అలాగని సాంప్రదాయ విలువలను అగౌరవపర్చడం స్త్రీ వాదం కాదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీ వాదం. ఇకనైనా మీ మీ బలాలు, వ్యక్తిగత సామర్థ్యాలను నమ్మడం ప్రారంభించండి. దుర్గాదేవీ, లక్ష్మీ, సరస్వతిలా ఉండండి. ఆ ముగ్గురిలో ఉన్న లక్షణాలను అలవర్చుకోండి. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉంది. దానిని సమర్థవంతంగా అనుభవించండి” అని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

. What am I in the eyes of most people? A single parent. A woman who laughs loudly. Someone who isn’t ladylike. A woman living on her terms in a mans world. Who raises her voice and is loud and assertive. A mother who raises her children perfectly without the support of a man. A woman who refuses to be artificially sweet to people to be accepted in the inner circles. A woman who has a strong opinion and is steadfast. A woman who runs her business and is capable of making sound financial decisions. A woman who doesn’t want to conform to the unreasonable patriarchal demands of society. And, for all the above, is categorised as an unreasonable, crazy, difficult, obstinate, tenacious, obnoxious and simply a misfit. I want to tell all the young girls who follow me that it is okay to have an independent thought process. It’s okay to have your unique perspective. Your identity is just not being somebody’s daughter or wife. You are a special life in your self. Feminism doesn’t mean that we disrespect traditional values. It just means standing up for the injustice which has been passed down for centuries under the guise of family traditions. Start believing in your strengths and capabilities. Be a Durga as much as a Laxmi as much as a Sarawati. You can embody all the three qualities. You have one life. Make the most of it! . . 📸- @shanthisspark

A post shared by renu desai (@renuudesai) on

Related posts