telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఓటమిపై కెసిఆర్ ఫోకస్.. ఇవాళ కీలక సమావేశం

kcr telangana

దుబ్బాకలో ఓటమిపై టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టిసారించింది. ఫలితాలపై సమీక్షా చేసేందుకు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్, సీఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించనున్నారు. ఈ సందర్బంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలకు సీఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దుబ్బాక అప్ ఎన్నిక ఫలితం జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్యెల్సీ ఎన్నికలపై పడకుండా టీఆర్ఎస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇవాళ సీఎం కెసిఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాగా..దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 61302 ఓట్లు, కాంగ్రెస్‌ 21819 ఓట్లు, బీజేపీ 62, 772 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బాంక్స్‌ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం రఘనందన్‌రావునే వరించింది. 

Related posts