telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాపును బీజేపీ బలుపు అనుకుంటుంది..

ponnam prabhakar fire on ktr

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరోసారి దుబ్బాక ఎన్నికపై స్పందించారు. దుబ్బాక ఓటమితో కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని… భవిష్యత్తులో పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. కార్యకర్తలందరూ టార్గెట్2023 కి అనుగుణంగా మరింత కష్టపడాలని కోరారు. భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా ఎన్నికల రోజు చేసిన దుష్ప్రచారం మరియు బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం లో ఎక్కడ కూడా అభివృద్ధి గురించి గాని మిగతా వాటి గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని చేసిన దుష్ప్రచారాలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి బిజెపి అభ్యర్థి మూడుసార్లు ఓడిపోవడం, టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడ కొట్టాలనే కసి బిజెపి పార్టీకి కలిసొచ్చిన అంశాలు అంతేగాని ఇది బీజేపీ పార్టీ గెలుపు కాదు రఘునందన్ రావు గెలుపు మాత్రమే అని తెలిపారు. 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 105 స్థానాలలో డిపాజిట్లు రాని బిజెపి పార్టీ, తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికలు పాలేరు, నారాయణఖేడ్, మొన్న జరిగిన హుజూర్ నగర్ లో 2000 ఓట్లు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దరిదాపుల్లోకి కూడా రాలేదని గుర్తు చేశారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా నిజామాబాదు లో కవిత ఓడ కొట్టాలన్నా కారణంతో, మరియు ఇతర కారణాలతో ఏదో నాలుగు పార్లమెంట్ స్థానాలలో గెలిస్తే, ఆ వాపును బలుపు అనుకోవడం వారి మూర్ఖత్వమని ఫైర్ అయ్యారు.

Related posts