telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఈరోజు కాకపోతే.. రేపు మ్యాచ్ కొనసాగింపు… ఫలితం తప్పనిసరి..

ICC-World-Cup-2019

ఈసారి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడి ప్రభావం చాలా ఉంది. చివరికి నేటి సెమీస్ కి కూడా, కొన్ని మ్యాచ్ లు కనీసం ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి. ఇవాళ మాంచెస్టర్ లో టీమిండియా బౌలర్లు ఎంతో కష్టపడి న్యూజిలాండ్ ను కట్టడి చేస్తే వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కురిసే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అయితే, మాంచెస్టర్ ను ముంచెత్తుతున్న వర్షం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడంలేదు. దీనిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.

ఆట మరో రెండు గంటలు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని, సాధ్యమైనంత వరకు ఇవాళే ఫలితం వచ్చేలా ప్రయత్నాలు కొనసాగాలని కామెంట్ చేశారు. మ్యాచ్ కొనసాగింపు ఇవాళ సాధ్యంకాని పక్షంలో మాత్రం మ్యాచ్ రేపు ముగిసే అవకాశాలున్నాయని వివరించారు. వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లకు టోర్నీ నిర్వాహకులు మరో రోజును కేటాయించటంతో.. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ వీలుకాని పక్షంలో మరుసటి రోజు మ్యాచ్ జరుగుతుంది.

Related posts