telugu navyamedia
రాజకీయ

క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు ద్రౌపది ముర్ము..

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకోసం లండన్ వెళ్తున్నారు.

ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల 17న ఆమె బ్రిటన్ బయల్దేరనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వెల్లడించింది.

రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ద్రౌపదీ ముర్ము లండన్​లో పర్యటించనున్నారు.

తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 (96) ఈ నెల 8న కన్నుమాశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు.

బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రివిచారం వ్యక్తం చేశారు

బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు.

Related posts