telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కళ్లు చెమర్చిన కరోనా కన్నీటి దృశ్యం

Allagadda

కరోనాతో శ్వాస ఆడక కళ్లెదుటే భర్త గిలగిలా గుంజుకుంటూ ప్రాణం విడవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కనీసం ఒక్కసారైనా భర్తను చేతుల్లోకి తీసుకుని తనవి తీరా చూసుకునేందుకు కూడా లేక గుక్క పట్టి ఏడ్చింది. పీపీఈ కిట్టు ధరించి ఓ మూల కూర్చొని చూస్తుండి పోయింది. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలో నివసించే వ్యక్తికి వారం కిందట కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వయసు 50 లోపేనని వైద్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్సలు అందిస్తూ వచ్చారు. శనివారం ఆ వ్యక్తికి ఉన్నట్టుండి పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. భార్య ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ అంబులెన్సును ఇంటి వద్దకు పిలిపించింది. పీపీఈ కిట్టు ధరించి భర్తను వాహనంలో కుర్చోపెట్టేలోపే అతడు తుది శ్వాస విడిచాడు. దగ్గరకు కూడా వెళ్లలేని స్థితిలో ఆమె ఓ మూల కూర్చొని రోదించిన తీరు చూపరులను కలచి వేసింది. మున్సిపల్ సిబ్బంది స్థానికుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Related posts