telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆయ‌న‌కు కిరాణా కొట్టే బెట‌ర్‌..సినిమాలు వేస్ట్ – రోజా సెటైర్

సినిమా టిక్కెట్ల ధరల అంశంపై ప్రభుత్వంతో సినిమా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయ‌ని .. దీనిపై ఒక సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామ‌ని న‌గరి ఎమ్యెల్యే రోజా అన్నారు.

గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్న అనంతరం ఆలయ వెలుపలకు‌ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాస‌రి నారాయ‌ణ‌రావు గారు గ‌తంలోనే చెప్పారు..చిన్న ప్రొడ్యూస‌ర్స్‌కు..చూసే పేద ప్రేక్ష‌కుల‌కు అనుగుణంగా టిక్కెట్ రేట్స్ ఉంటే వాళ్ళ లైప్ స్టైల్‌కి వాళ్ల ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో చేశారు.

పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ పెద్ద సినిమా, చిన్న సినిమాలకు ఉపయోగ పడేలా నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు.

నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు.

ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు,  పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రొబ్ల‌మ్స్ కొని తెచ్చుకుంటున్నార‌ని  ఆమె అన్నారు.

అలాగే కొద్దిమంది నోటి దురద వల్లే మా ఎన్నికలు జనరల్ ఎలక్షన్ ను తలపించాయని. పొలిటికల్ పార్టీ పెట్టి సినిమాలు తీస్తున్న వ్యక్తి వల్లనే ఇదంతా జరుగుతుందని.. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం వల్లే ఇదంతా జరుగుతోందని రోజా ఫైర్ అయ్యారు.

మంచి ఉదేశ్యంతో చర్చలకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రోజా అన్నారు. సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారు అని రోజా అన్నారు.

Related posts