ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.ఈ విషయాన్ని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు తెలుసుకోవాలని చెప్పారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా… అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు, బీజేపీ కలిసికట్టుగా చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను బీజేపీ నెరవేర్చకుండా ఏపీ ప్రజల్ని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ….కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బీజేపీలో చేరారని.. వారు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి బీజేపీ నేతలు ఉన్న పరువును పొగొట్టుకుంటున్నారని విమర్శించారు.
కాగా..విజయవాడలో బీజేపీ మంగళవారం ప్రజా ఆగ్రహ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్.. రాష్ట్రంలో బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తులు త్వరలోనే జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మూడు రాజధానులనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు: యనమల