telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సునీతతో రోజుకొక మాట మాట్లాడిస్తున్నారు: సీఎం రమేశ్

CM Ramesh Comments to YCP

వివేకా కుమార్తె సునీతాతో ప్రెస్ మీట్లు పెట్టించి రోజుకొక మాట మాట్లాడిస్తున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు రమేశ్ ఆరోపించారు. హత్య గురించి వివేకా సునీత తొలిరోజు మీడియాతో మాట్లాడుతూ, విచారణ నిష్పక్షపాతంగా సాగాలని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఆమెతో ఢిల్లీ, ఏ విధంగా మాట్లాడించారు? ఈరోజు హైదరాబాదులో ఆమెతో ఎలా మాట్లాడిస్తున్నారనే విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. కడప ఎస్పీ పనితీరుపై ఏ రాజకీయ పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు.

రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ, బీజేపీ నాయకులు ఈసీని కలిసిన తర్వాత బదిలీ ఆదేశాలు రావడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీల కుమ్మక్కు రాజకీయాల్లోకి ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ప్రవేశించిందని రమేశ్ ఆరోపించారు.

వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే కడప ఎస్పీని బదిలీ చేయించారన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేదని అయినప్పటికీ ఆయన పై బదిలీ వేటు వేశారని అన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులను ఈసీ బదిలీ చేయడం ఇదే ప్రథమం అని అన్నారు. ఈసీ పని తీరు చూస్తుంటే ఎన్నికల నిర్వహణ పై ఆందోళనగా ఉందని రమేశ్ పేర్కొన్నారు.

Related posts