telugu navyamedia
సినిమా వార్తలు

సమంత చెప్పింది నమ్మాల్సిందే…!

Samantha images

టైటిల్ చూసి అసలు సమంత ఏం చెప్పింది? ఏం నమ్మాలి ? అనుకుంటున్నారా ? సమంత ఏం చెప్పిందంటే… అబ్బాయిలు తమ అమ్మలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటారు అనే మాటను అందరూ వినే ఉంటారు. ఇప్పుడామాట సమంత విషయంలో నిజమైందట. అంతేకాదు దానికి సాక్ష్యంగా ఓ ఫోటో కూడా చూపిస్తోంది. ఈ ఫొటోలో నాగచైతన్య తల్లి లక్ష్మీ, భార్య సమంతల మధ్య కూర్చున్నాడు. అయితే విశేషం ఏమిటంటే అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే కలర్, డిజైన్ ఉన్న దుస్తులను ధరించారు. అయితే ఇలా జరగడం అనుకోకుండా జరిగిందని చెప్తోంది సమంత. ఎలాంటి ప్లాన్ లేకుండా ఇద్దారూ ఒకేలాంటి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చారట. ఈ విషయాన్ని అందరూ నమ్మాలని చెబుతోంది సమంత. ఒక రోజంతా అత్తయ్యతో సంతోషంగా గడిపానని చెప్తోంది ఈ బ్యూటీ. ఇక ఈ ఫోటో ఇటీవల వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహం సందర్భంగా తీసినట్టు తెలుస్తోంది.

Samantha

Related posts