telugu navyamedia
సినిమా వార్తలు

రాజ్ తరుణ్ తాగి కారు నడిపాడు… ఆధారాలు కూడా…!?

raj tarun accident issue viral

సోమవారం అర్ధ‌రాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ రింగు రోడ్డు రహదారి మలుపు వద్ద ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపురి కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్‌ను, పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఉన్నట్టు సీసీ ఫుటేజీలో వెల్లడైంది. ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా రాజ్ తరుణ్ స్పందించాడు. అతివేగంతో వస్తుండగా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ మలుపు వద్ద కారు కంట్రోల్‌ కాకపోవడంతో గోడకు ఢీకొట్టి, గాయాలయ్యాయనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని రాజ్ తరుణ్ వివరించారు.

అయితే రాజ్‌తరుణ్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని, దానికి సంబంధించి వీడియోలు, వాయిస్‌ రికార్డింగ్‌లు తన దగ్గర ఉన్నాయని తెలుసుకుని, వాటిని తొలిగిస్తే నగదు ఇస్తానని రాజ్‌తరుణ్‌ బతిమిలాడాడని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కార్తీక్‌ మీడియా ముందుకు వచ్చాడు. దీనిపై సినీ ఆర్టిస్టు రాజారవీంద్ర స్పందించారు. కార్తీక్‌ చెబుతున్నది అబద్ధమని, అది వాస్తవం కాదని కొట్టిపారేశాడు. అతను తన దగ్గర ఘటన జరిగినప్పుడు రాజ్‌తరుణ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని రాజారవీంద్ర ఆరోపించారు. చివరకు రూ.3 లక్షలు ఇవ్వాలని, లేదంటే మీడియా ముందుకు వెళ్తానని బెదిరించాడని రాజారవీంద్ర తెలిపారు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని, రెండురోజుల్లో రాజ్‌తరుణ్‌ షూటింగ్‌కు వస్తాడని వివరించారు. రాజ్‌తరుణ్‌పై చేస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామని రాజారవీంద్ర స్పష్టం చేశారు. కార్తీక్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజారవీంద్ర చెప్పారు. తనను కార్తీక్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆయనపై చర్య లు తీసుకోవాలని రాజ్‌తరుణ్‌ గురువారం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై నార్సింగి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు కార్తీక్‌ దగ్గర ఉన్న ఆడియో, వీడియోలను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కేసులో సెక్షన్‌లు కూడా మారే అవకాశం ఉండడంతో పాటు రాజ్‌తరుణ్‌ నుంచి సేకరించే స్టేట్‌మెంట్‌ కీలకంగా మారనున్నది.

Related posts