telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “అసురన్” రీమేక్

Asuran-remake

వెంకీ మామ అనే చిత్రంతో మంచి హిట్ సాధించిన వెంక‌టేష్ త్వ‌ర‌లో అసుర‌న్ రీమేక్ చిత్రాన్ని మొద‌లు పెట్ట‌నున్నాడు. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం అసుర‌న్. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై సురేష్ బాబు, క‌ళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారా అనే ఆస‌క్తి అభిమానుల‌లో ఉండ‌గా, శ్రీకాంత్ అడ్డాల పేరు ఫ్రేంలోకి వచ్చింది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రం త‌ర్వాత మ‌రో హిట్ కొట్ట‌ని శ్రీకాంత్‌తో సినిమా చేస్తే స‌క్సెస్ ఇస్తాడా అని వెంకీ అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. శ్రీకాంత్ అడ్డాల‌తో అసుర‌న్ రీమేక్ చేయ‌డంపై వెంక‌టేష్ స్పందించారు. నేను ఇంతకు ముందు శ్రీకాంత్‌తో కలిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా చేసాను. అతని పని శైలి నాకు తెలుసు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండ‌స్ట్రీలో మ‌రిన్నిసినిమా ఆఫ‌ర్స్ పొందాల‌నే క‌సితో శ్రీకాంత్ అడ్డాల ఉన్నారు అని వెంకీ అన్నాడు.

Related posts