telugu navyamedia
సినిమా వార్తలు

జూన్ లో సెట్స్ పైకి “హిరణ్యకశిప”

Rana

దర్శకుడు గుణశేఖర్ “రుద్రమదేవి” సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని “హిరణ్యకశిప” అనే పౌరాణిక చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, రానా కథానాయకుడుగా చేయనున్నాడని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా ? అనే అనుమానం మొదలైంది అందరిలో. ఈ విషయం కాస్తా సురేష్ బాబు చెవిన పడడంతో ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, స్క్రిప్టు పై కసరత్తులు చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ బయటికి రాకున్నా, సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పై ‘సెవెంటీన్ వీఎఫెక్స్ స్టూడియో’ వారు తమకి అప్పగించిన పనులను కానిచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ లో ఈ సినిమాను లాంచ్ చేసి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలు పెడతారని సమాచారం. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నారు నిర్మాతలు. రానా కెరీర్లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచి పోతుందని అంతా భావిస్తున్నారు. “బాహుబలి” తరువాత రానా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది.

Related posts