కింగ్ నాగార్జున హీరోగా అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్, అలీ రెజా, మయాంక్, ప్రదీప్, ప్రకాశ్ కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఈ యేడాది ఫిబ్రవరి 15వ తేదీ వైభవ్ లేఖిని వివాహం చేసుకుంది. నిజానికి వీరిద్దరికీ ఇది ద్వితీయ వివాహమే. నాలుగు రోజుల ముందు దియా మీర్జా తాను గర్భవతిని అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాంతో ఆమెను తోటి నటీనటులంతా అభినందనలతో ముంచెత్తారు. ఇటీవలే దియా మీర్జా, తన భర్త వైభవ్ లేఖి, అతని కుమార్తెతో కలిసి మాల్దీవ్స్ కు జాలీడే ట్రిప్ కు వెళ్ళొచ్చింది. అనంతం ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది. దాంతో సహజంగా కొంతమంది నెటిజన్లు దియా మీర్జాను విమర్శించడం మొదలెట్టారు. అయితే వాటికి దియా మీర్జా తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు తన జీవితంలో ఇప్పుడు రావడం ఆనందంగా ఉందని దియా తెలిపింది. ఓ మహిళ తనకు సంబంధించిన నిర్ణయాలను తనకు తానుగా తీసుకునే అవకాశం ఉండాలని, అది పిల్లలను కనడం, పెళ్ళి చేసుకోవడం ఏదైనా కావచ్చునని దియా చెప్పింది.
previous post