బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- దీపికా పదుకొనే జంటగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ అప్పట్లో ఎంతటి సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. కంప్లీట్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సైఫ్-దీపికా మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో అప్పట్లో ఓ సంచలనం. సైఫ్ డ్యూయల్ రోల్….దీపికా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఆ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఎందుకనో అది దాదాపు పదేళ్ల కి వర్కౌట్ అయింది. ఇప్పుడు లవ్ ఆజ్ కల్ సీక్వెల్ ని ఇంతియాజ్ తెరకెక్కిస్తున్నారు. సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. అప్పట్లో సైఫ్ పోషించిన పాత్రని కార్తీక్ ఆర్యన్ పోషిస్తుండగా.. ఇందులో సైఫ్ డాటర్ సంథింగ్ హాట్ రోల్ లో నటించడం ఆసక్తికరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇంతియాజ్ తనదైన మార్క్ సినిమాని తెరకెక్కిస్తున్నారని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే అందరికి అర్థమవుతోంది. రొమాంటిక్ తో పాటు కామెడీని సినిమా మొత్తం ఆసక్తికరంగా మలిచినట్టు అనిపిస్తోంది. సారా-కార్తీక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కావాల్సినంత ఫన్ ని ట్రైలర్ లోనే చూపించారంటే ఈ సినిమా యూత్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకోబోతోందో అర్థం చేసుకోవచ్చు.
లిప్ లాక్ సీన్స్ లో ఎలాంటి భేషజం లేకుండా సైఫ్ డాటర్ హాట్ హాట్ గా నటించేసింది. హీరో పాత్రకన్నా హీరోయిన్ పాత్ర ను ఎక్కువగా హైలైట్ చేశారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సారా డామినేటింగ్ రోల్ కు పర్ పెక్ట్ గా యాప్ట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కార్తిక్ కామెడీ టైమింగ్ కరెక్ట్ గా సూటయిందని అంటున్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీకి ఏమాత్రం తక్కువలేదని ట్రైలర్ తో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ట్రైలర్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. లవ్ ఆజ్ కల్-2 సక్సెస్ కు దగ్గరగా ఉందన్న కామెంట్లు పడుతున్నాయి. ఈ సినిమాని ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా రోజునే మన టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక అప్పట్లో లవ్ ఆజ్ కల్ సినిమాని తీన్‌మార్ పేరుతో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటించిన ఆవిడనే పవన్ ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారు.
భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి