telugu navyamedia
సినిమా వార్తలు

సందీప్ కిషన్ పాన్‌ ఇండియా మూవీ ‘మైఖేల్‌’ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘మైఖేల్’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ లో సందీప్ కిషన్ ఒక చేతికి సంకెళ్లు ఉండగా.. మరొక చేతిలో బ్రాస్ ని పట్టుకుని ఉన్నాడు చొక్కా, చేతులకు రక్తం ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంజిత్ జయకొడి డైరెక్షణ్‌లో వస్తున్న ఈ సినిమాని భరత్ చౌదరి – రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఇతర తారాగణం మరియు సిబ్బంది వివరాలు తరువాత వెల్లడించబడతాయి. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతి తో కలసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts