telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ హీరోకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్

Dhruv-sarja

రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జాకు ఆయన సతీమణి ప్రేరణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ధృవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నామని, త్వరలోనే కోలుకుంటామని అన్నారు. అలానే కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని, దానిద్వారా మన చుట్టూ ఉన్నవాళ్లకు కరోనా సోకకుండా ఉంటుందని ధృవ్ అన్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బండ్లగణేష్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్‌‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ ప్రస్తుతం ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక బిగ్ బి కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ గా తేలింది. దాంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది .

Related posts