అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో తెరకెక్కుతుంది. రణబీర్ కపూర్- అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున “నంది అస్త్ర” అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింఫ్స్, సాంగ్స్ , పోస్టర్స్ ఆకట్టుకోగా..తాజాగా నాగ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
సహస్ర నదీమ్ సమరత్యం
హే నంది అస్త్రం
ఖండ్ ఖండ్ కురు
మమ్ సహక్యం మమ్ సహక్యం..
అంటే ఒక అస్త్రంలో వేయి నందుల బలం నందీ అస్త్రం’ అని పేర్కొంది. ఆర్టిస్ట్ అనీశ్గా నాగ్ చేసిన పాత్ర ఈ చిత్రంలో చాలా ప్రత్యేకమని దర్శకుడు అయాన్ ముఖర్జీ అన్నారు.
పవర్ఫుల్ లుక్‌లో నాగ్‌ను చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు. నాగ్ పాత్రను పరిచయం చేస్తూనే ఈ ట్రైలర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. ఈనెల 15న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పింది.
కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ – ఆలియాభట్‌లు హీరోహీరోయిన్లు కాగా.. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జునలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.
Meet Artist Anish Shetty and his NANDI ASTRA
An Astra with the Strength of a 1000 Nandi’s within it!సహస్ర నందిమ్ సామర్ధ్యం
హే నంది అస్త్రం
ఖండ ఖండ ఖురు
మామ్ సహాయకం, మామ్ సహాయకం#Brahmāstra Trailer out on June 15#Nagarjuna #RanbirKapoor #AliaBhatt pic.twitter.com/hFM4uPPDC8— Brahmastra Telugu (@Brahmastratel) June 11, 2022
నో … స్పందించను..!