telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చెఫ్ గా మారిన అసిన్ కూతురు… వీడియో వైరల్

Asin

దక్షిణాదిన అగ్రహీరోల సరసన నటిస్తూ తన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న బ్యూటీ అసిన్. పెళ్ళి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది. రాహుల్‌ 2016లో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వీరికి అరిన్‌ అనే చిన్నారి ఉంది. తరచుగా అరిన్‌కి సంబంధించిన వీడియోలు లేదంటే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది అసిన్. గత ఏడాది తన కూతురి రెండవ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి కొద్ది క్షణాలలోనే వైరల్‌గా మారాయి. తాజాగా అరిన్‌ కిచెన్‌లో వంట చేస్తున్న వీడియోలని షేర్ చేసింది. ఎంతో శ్రద్ధతో కూరగాయలని (బొమ్మ వస్తువులు) కట్‌ చేస్తూ, వాటిని పాత్రలో వేస్తుంది. ఆ తర్వాత స్టవ్‌పై పెట్టి కూర చేస్తుంది. కిచెన్‌లో అరిన్‌ వంటకి సంబంధించిన వీడియోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో వీడియోలో అరిన్‌ ఇంటిని కూడా శుభ్రపరచింది.

Related posts