telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్స్ ఆఫీస్ వద్ద “చిచ్చోరే” రచ్చ

Chichore

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “చిచ్చోరే”. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో సందడి చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కేరీర్‌లోనే “ఎం.ఎస్. ధోని” తర్వాత తొలి వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సినీ విశ్లేకుడు తరణ్ ఆదర్శ్ ఈ సనిమాకు సంబంధించిన వీకెండ్ కలెక్షన్స్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ మొదటి రోజు 7.32 కోట్లు రాబట్టింది. శనివారం 12.25 కోట్లు, ఆదివారం 16.41 కోట్లతో వీకెండ్‌ను 36 కోట్లతో ముగించిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Related posts