telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా మా పెళ్లిని ఆపలేదు : హీరో నిఖిల్ సిద్ధార్ధ

nikhil

కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు హీరో నిఖిల్ సిద్ధార్ధ. హీరో నిఖిల్.. డాక్టర్ పల్లవిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్నాను. ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Related posts