telugu navyamedia
సినిమా వార్తలు

సుల్తానాతో వర్మ.. మరో డాన్స్‌ వీడియో వైరల్!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో వర్మ చేసే హంగామా మాములుగా ఉండదు. ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటారు.

Ram Gopal Varma: I won't change my lifestyle because of coronavirus |  Telugu Movie News - Times of India

ఈ మధ్య ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇనయా సుల్తానా పుట్టిన రోజు వేడుకలో వర్మ సుల్తానాలో కలసి రంగీలా సినిమాలోని పాటకు స్టెప్పులు వేశాడు. ఆమె కాళ్లు పట్టుకొని విచిత్రంగా వ్యవరించాడు.వర్మ ఇందులో కాస్త హద్దులు మీరి ప్రవర్తించడంతో దీనిపై నెట్టింట పలు విమర్శలు కూడా రావ‌డంతో అందుకు వర్మ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.

Inaaya Sultana shared the video with Ram Gopal Verma, was seen dancing in a  sensuous manner - MoviesDarpan

ఇది నేను కాదు.. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఇనయా సల్తానా కానే కాదంటూ.. ఆ వీడియోను పోస్టు చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీద ఒట్టు అంటూ తనదైన శైలీలో ఆర్జివి ట్వీట్ చేశారు.

ఇక ఇనయా సుల్తానా కూడా ఇది ఒక ‘బెస్ట్ నమ్మశక్యం కాని క్షణాలు అని తన పుట్టిన రోజును ఎప్పుడూ ఇలా జరుపుకోలేదని’ చెప్తూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే సుల్తానాతో దిగిన ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన వర్మ వైరల్ వీడియోలో నా డ్యాన్స్ పార్టనర్‌ అందమైన సుల్తానాతో అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో వేడి ఇంకా తగ్గకముందే మరో వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈసారి ఆ యువతి త‌న ఖాతా నుండి షేర్ అవగా దానికి వర్మ ఖాతా కూడా ట్యాగ్ చేసింది.

Image

దీంతో ఆర్జీవీ ఆ యువతికి ఇష్టం లేకుండా డ్యాన్స్‌ చేశాడన్న కామెంట్లకు సుల్తానా చెక్‌ పెట్టినట్లైంది. రాంగోపాల్‌ వర్మతో డ్యాన్స్‌ చేయగానే ఇనాయా సుల్తానా ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇందులో ఒరిజినల్ సౌండ్స్ కూడా ఉండడంతో మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ram Gopal Varma New Viral Video Surfaces, Also Features Inaya Sultana

కాగా.. ‘అవ్యోం జగత్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు దినేష్‌ నర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘బుజ్జి ఇలా రా’ అనే సినిమాలోనూ ఇనాయా ఓ చిన్న పాత్రలో నటిస్తోంది.

Related posts