telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డ్రగ్ టెస్ట్ చేస్తే అతడు ప్రెగ్నెంట్ అని తేలింది…!?

Basket

ప్రముఖ అమెరికన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు డీజే కూపర్ కు సంబంధించిన ఓవిషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్నెషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (ఏఫ్ఐబీఏ) 2018లో ఓ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ టెస్టులో కూపర్ రెడ్ హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. అయితే రిపోర్టులో డ్రగ్ కంటెంట్ ఏమీ లేదు అనే వచ్చింది. కానీ ఇదే రిపోర్టులో ప్రగ్నెంట్ అని రావడం ఆశ్చర్యకరం. అది చూసిన ఏఫ్ఐబీఏ అధికారులు షాక్ అయ్యారు. ఆ తరువాత కూపర్‌ను విచారిస్తే అసలు విషయం తెలిసింది. డోప్ టెస్టుకు అతడు ఇచ్చింది తన యూరిన్ శాంపిల్ కాదని.. తన ప్రియురాలిదని. ఆ సమయంలో ఆమె గర్భవతి కావడంతో రిపోర్టులో ప్రగ్నెన్సీ హార్మోన్లు ఉన్నట్లు వచ్చింది. గతేడాది బోస్నియన్ జాతీయ జట్టుకు ఆడేందుకు కూపర్ ఇలా అడ్డదారి తొక్కినట్టు అధికారులు తేల్చారు. దీంతో కూపర్‌పై రెండేళ్ల నిషేధం విధించారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts