telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మేజర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…

యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. అడవి శేష్ సరసన శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ‘మేజర్’ టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు సినిమా పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ‘మేజర్’ చిత్రాన్ని జూలై 2న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.

Related posts