telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

RIP మాధవీలత… సారీ… నువ్వు ఇంకా పోలేదా? : శ్రీరెడ్డి

Madhavilatha

ఇటీవల ‘నచ్చావులే’ హీరోయిన్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీలత తన ఫేస్ బుక్‌లో ‘ఐ హేట్ మై హెల్త్ ఇష్యూస్ అంటూ.. మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని, ఇలా మందులు వాడుతూ ఉంటే.. ఏదో ఒకరోజు అవి పనిచేయక ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. దీంతో ఆమె బాధను మరింత లోతుగా అర్ధం చేసుకున్న కొంతమంది సోషల్ మీడియాలో మాధవీలత చచ్చిపోతానంటోంది అంటూ ఆ పోస్ట్‌ను వైరల్ చేశారు. ఆ తరువాత “నేను చచ్చిపోవడం లేదు మొర్రో.. నాకు చచ్చిపోయేటంత జబ్బేం లేదు.. ఏదో క్యాజువల్ పోస్ట్ పెడితే నేను చచ్చిపోతానని స్టేట్ మెంట్ ఇచ్చినట్టుగా చాలా మంది ఫోన్‌లు మెసేజ్‌లు పెడుతున్నారు.. నా చావు మీద నేను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు” అంటూ తన చావుపై తానే క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మాధవీలతకు వచ్చింది. ఇదిలాఉంటే.. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా మాట్లాడిన మాధవీలతపై ఇప్పుడు హాట్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. “RIP మాధవీలత… ఓ సారీ.. ఇంకా పోలేదా?” అంటూ సంచలన పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఎప్పటిలాగే ఆమె పోస్టుపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Srireddy

Related posts