telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కార్తీ “సుల్తాన్” ఫస్ట్ లుక్

Sultan

తమిళ హీరో కార్తీ తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘రెమో’ ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. రష్మిక హీరోయిన్‌. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో కార్తీ అదే సుల్తాన్‌ యాక్షన్‌ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫస్ట్ లుక్‌ విడుదల సందర్భంగా… ”ప్రియమైన సోదర, సోదరీమణుల్లారా మీ ప్రేమాభిమానాలే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. సుల్తాన్‌ చిత్ర ఫస్ట్ లుక్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను” అని హీరో కార్తీ పోస్ట్‌ చేశారు. మొదటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ. ఈ మధ్య వచ్చిన ‘చినబాబు’, ‘ఖైదీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు కార్తీ.

Related posts