telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం… ఫోటోలు వైరల్

Nikhil

యంగ్ హీరో నిఖిల్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. రీసెంట్‌గా ‘అర్జున్ సురవరం’ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న ఉన్న నిఖిల్ ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్-పల్లవిల ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో గోవాలో శనివారం నాడు (ఫిబ్రవరి 1) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గోవాలోనే నిఖిల్ తన లవ్ ప్రపోజ్‌ను డాక్టర్ పల్లవి వర్మకు తెలియజేడంతో తిరిగి అక్కడే నిశ్చితార్థం వేడుకను జరుపుకోవడం విశేషం. ఏప్రిల్ 16న నిఖిల్-పల్లవి వివాహం జరగనుంది. కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో నిఖిల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. తాను ఒక డాక్టర్ ప్రేమలో ఉన్నట్టు తెలిపారు నిఖిల్. ఈ సందర్భంగా ఆమె తనకు చాలా స్పెషల్ అని.. తనను బాగా అర్ధం చేసుకునే మంచి అమ్మాయి అని.. ఫ్రెండ్స్‌ తో బయటకు వెళ్లినా, షూటింగ్ అప్పుడు మాకు ఎదురయ్యే పరిస్థితుల్ని తను చక్కగా అర్ధం చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. అయితే తన పేరు కాని, ఎంగేజ్‌మెంట్ విషయాలు కాని బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు నిఖిల్. అయితే సడెన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఆ తరువాత మీడియాకు ఫొటోలు విడుదల చేశారు నిఖిల్. అయితే ఈ ఫొటోల్లో తనకు కాబోయే భార్య ఫేస్‌ను రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు నిఖిల్.

Related posts