telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

జడేజాకు బర్త్ డే విషెస్ ల వెల్లువ

రవీంద్ర జడేజా ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ట్విట్టర్‌లో జడేజా పేరు మారు మోగిపోయింది. దానికి కారణం నేడు జడేజా తన 32 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. దాంతో ప్రముఖ క్రికెటర్లు ట్విటర్ వేదికగా జడుజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేశాడు. ఇదే విదంగా మాజీ బౌలర హర్బజన్ సింగ్ కూడా పరుగులు చేయడం, వికెట్లు పడగొట్టడం ఆపొద్దంటూ విష్ చేశాడు. ఇదిలా ఉంటే జడేజా 2009 ఫిబ్రవరీ 8న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ వేదికగా భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆతరువాత అదే ఏడాది ఫిబ్రవరీ 10న శ్రీలంకతో తన టీ20 కెరీర్‌ను ప్రారంభం చశాడు. ఇక టెస్టుల విషయానికొస్తే 2012 డిసెంబరు 13న ఇంగ్లాండ్‌తో తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు. ఇక తన చివరి మ్యాచ్ ఇటీవల కంగారూలతో జరిగిన టీ20. గాయం కారణంగా మిగిలిన టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ రోజు జడేజా పుట్టిన రోజు సందర్భంగా అతడి పేరు ట్విట‌ర్‌లో ట్రెండ్ అవుతోంది.

Related posts