telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ రాహుల్ కే .. కాంగ్రెస్ పగ్గాలు..

rahul grand victory in kerala with 4laks more votes

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూనో లేక అవమాన భారం భరించలేకనో రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడంతో అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా సోనియా తలకెత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళి ఆ పగ్గాలు రాహుల్ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని ఆ పార్టీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిని వీడిన రాహుల్‌ గాంధీ మళ్లీ ఆ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు.

పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని, ఇదే విషయంపై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని ఆయన అంగీకరిస్తారని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయన వెంట ఉన్న కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ జులైలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్‌ తప్పుకోవడం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమని, మళ్లీ ఆయన ఆ పదవిని అలంకరిస్తారని వేణుగోపాల్ చెప్పారు. వచ్చే నెలలో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు మరో నేత చెప్పారు. అంటే దీనిబట్టి చూస్తే రాహుల్ గాంధీ మళ్ళి కాంగ్రెస్ పగ్గాలు దక్కించుకోనున్నట్టు తెలుస్తుంది.

Related posts