telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పశ్చిమ దేశాలపై .. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లెవరోవ్‌ .. అసంతృప్తి..

russian minister sergi lenover fire on west countries

రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లెవరోవ్‌ నియమ నిబంధనలు, మానవ హక్కులు, సరళీకరణ అంటూ ఇతర దేశాలకు నీతులు చెప్పే పశ్చిమ దేశాలు వాటిని ఆచరించటంలో మాత్రం విఫలమవుతున్నాయని ఎద్దేవా చేశారు. మానవ హక్కులను పరిరక్షిస్తున్నామని, ప్రపంచ శాంతిని కాపాడుతున్నామని పశ్చిమ దేశాలు సగర్వంగా చెప్పుకుంటాయని, అయితే వాటి చర్యలు మాత్రం ప్రపంచ దేశాల విశ్వాసాన్ని, శాంతి, భద్రతలను దెబ్బతీసే విధంగా వుంటున్నాయని ఆయన ఒక పత్రికకు రాసిన వ్యాసంలో విమర్శించారు.

సరళీకరణ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటూ ఊదరగొట్టే పశ్చిమ దేశాలు తమ విధానాలలో అసమానతలను, అన్యాయాన్ని, స్వార్ధాన్ని పెంచి పోషిస్తున్నాయని, ‘నీతులు ఎదుటి వారికి చెపేందుకే తప్ప తమకు వర్తించవని’ ఈ దేశాలు భావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమ ఏకపక్ష అహంకారం, ఎదుటివారిని ఎత్తి చూపటం వంటి వాటితో రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఐరాస ఆవిర్భావానికి కారణమైన దేశాలు ఆ సంస్థ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు వెన్నుపోటు పొడుస్తున్నాయని దుయ్యబట్టారు.

Related posts