telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కవిత కుమారుడికి జ్వరం.. పరామర్శించిన కేసీఆర్‌

Woman candidates kcr cabinet Telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, నిజామాబాద్ ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్‌ స్వయంగా హాస్పటల్‌కి వెళ్లి మనవడిని పలుకరించారు. . వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు మనవడితో గడిపారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

Related posts