telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత జ‌ర్న‌లిస్టుకు మెగ‌స్సేసే అవార్డు

ravish kumar

భారత జ‌ర్న‌లిస్టు రావిష్ కుమార్‌కు రామ‌న్ మెగ‌స్సేసే అవార్డు ద‌క్కింది. ఈ ఏడాది మొత్తం అయిదుగురికి ఈ అవార్డును ప్ర‌క‌టించారు. అయితే జ‌ర్న‌లిజం రంగంలో అద్భుత సేవ‌లు అందించిన ఎన్డీటీవీ జ‌ర్న‌లిస్టు రావిష్ కుమార్‌ను మెగ‌స్సేసే అవార్డు వ‌రించ‌డం విశేషం. ఆసియా నోబెల్ బ‌హుమ‌తిగా రామ‌న్ మెగ‌స్సేసే అవార్డును కీర్తిస్తారు.

ఈ అవార్డు గెలిచిన మిగితా వారిలో మ‌య‌న్మార్‌కు చెందిన జ‌ర్న‌లిస్టు కో స్వీ విన్‌, థాయిలాండ్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త అంగ్‌ఖానా నీలాపాజిత్‌, పిలిప్పీన్స్‌కు చెందిన సంగీత‌కారుడు రాముండో పూజంటే కాయాబ్‌యాబ్‌, ద‌క్షిణ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ కీలు ఉన్నారు.

జ‌ర్న‌లిస్టు రావిష్ కుమార్ వ‌య‌సు 44 ఏళ్లు. టీవీ జ‌ర్న‌లిస్టుల్లో ఈయ‌న చాలా సీనియ‌ర్‌. రావిష్ చేసే ప్రైమ్‌టైమ్ ప్రోగ్రామ్ ఎంతో మందికి స్వ‌రాన్ని ఇచ్చింద‌ని మెగ‌స్సేసే త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సెప్టెంబ‌ర్ 9న మ‌నీలాలో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును రావిష్ కుమార్ కు అందజేయనున్నారు.

Related posts