telugu navyamedia
క్రీడలు వార్తలు

జడేజాను అనుకరించిన ధోని…

రవీంద్ర జడేజా కత్తిసాము గురించి తెలియని వారుండరు. హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ జడేజా బ్యాట్‌తో కత్తిసాము చేయడం మన చూసాము. దీన్ని ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ కూడా అనుకరించే యత్నం చేశాడు. 2019 ఐపీఎల్‌లో భాగంగా ఓ ప్రకటనలో నటించే క్రమంలో జడేజా తరహాలో బ్యాట్‌తో కత్తిసాము చేశాడు వార్నర్‌. కానీ అంతలా ఆకట్టుకోలేకపోయాడు. ఇక భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా బ్యాట్‌ సాముని కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా అనుకరించగా.. తాజాగా టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఆ అనుకరణ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో జడేజాని ధోనీ అనుకరించగా.. ఆలస్యంగా వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అభిమానులతో పంచుకుంది. అయితే మహీ బ్యాట్‌తో కాకుండా ఖాళీ చేతులతోనే కత్తిసాము చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

Related posts