బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమాలలో సలార్ ఒక్కటి. ఈ సినిమా ప్రారంభం నుంచే అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ సినిమాను జాతీయ స్థాయి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. అతడు ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్న ప్రశాంత్ ఆ తరువాత సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీ హక్కులపై వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుందని, అందుకుగాను అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా డిజిటల్ హక్కులకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్దమయినట్లు టాక్ నడుస్తోంది. ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ విషయం పై క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది.