telugu navyamedia
సినిమా వార్తలు

బ్యాచ్‌లర్‌ వచ్చేస్తున్నాడు!

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’‌. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ రిలీజ్‌ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ ధృవీకరించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి.

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బ, ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిచారు.

Related posts